2 114 అల్లాహ్ ఆరాధనాలయాలలో ఆయన నామ సంస్మరణను నిషేధించి, వాటి వినాశానికి ఒడికట్టే వానికంటె పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆ ఆరాధనాలయాలలో అడుగు పెట్టటానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా, భయపడుతూ ప్రవేశించాలి. కాని వారికి ప్రపంచంలో తీవ్రపరాభవమూ, పరలోకంలో ఘోరశిక్షా తప్పవు.

Comments