ఖుర్ఆన్ భావామృతం
ఖుర్ఆన్ భావామృతం
ప్రవక్తల పరంపర -21
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్
ఆయనపై శాంతి కురియు గాక 14
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు
మొట్టమొదటి దైవవాణి అవతరణతో దైవ ప్రవక్త పదవిని పొందారు. ఇక సమాజాన్ని మేలుకొలుప వలసి ఉంది. సంస్కరించవలసి ఉంది. ప్రక్షాళనం చేయవలసి ఉంది. హృదయాంతరాలలో నుండి మనుషులను మార్చవలసి ఉంది. ప్రజలను జాగృత పరచవలసి ఉంది పడుకుంటే ఎలా అంటూ అల్లాహ్ లేపుతున్నాడు. దుప్పటి కప్పుకుని పడుకున్న మనిషీ!లే; లేచి (ప్రజలను పరలోకం గురించి) హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, మాలిన్యానికి దూరంగా ఉండు.... దివ్య కురాన్ 74: 1-4
అంటే దేవుడిని మర్చిపోయిన ప్రజలను దేవుడి గురించి జ్ఞాపకం చేయించడం. దుర్మార్గులైన ప్రజలను సన్మార్గంలోకి తేవడం, ఏకేశ్వరుడయిన దేవుని గురించి వివరించడానికి, పరలోకం ఉందని హెచ్చరించడానికి, నీ బాహ్యం తరాలను పరిశుభ్ర పరుచుకో. ఏకేశ్వరుని సందేశాన్ని ప్రజలలో ప్రచారం చేయవలసి ఉందని తన ప్రవక్తలో మనోబలం కలిగిస్తున్నాడు అల్లాహ్.
మానవులను సంస్కరించడానికి మానవులలో నుండే ఒక ఉత్తమమైన వ్యక్తిని తన దైవ ప్రవక్త గా ఎన్నుకుని ఆ ప్రవక్త ద్వారా తన సందేశాన్ని, ఆదేశాలను ప్రజల దాక చేర వేయిస్తాడు.
అలా సంస్కరించడానికి భూమిపై ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఆయా జాతులలో ఆయా తెగలలో పుట్టించ బడ్డారు. పాపాలుపెరిగిపోయినప్పుడల్లా, మానవ వినాశనం జరిగినప్పుడల్లా స్వయంగా అల్లాహ్ వచ్చి సంస్కరణ చేపట్టడు కాని ప్రవక్తల ద్వారా సమాజాన్ని సంస్కరిస్తాడు.
సందేశ ప్రచారమైన పెద్ద భారాన్ని అల్లాహ్ అంతిమ ప్రవక్త పై మోపనున్నాడు.
ఒక దేశ రాష్ట్రపతి ఒక్కొక్క వ్యక్తి వద్దకు వెళ్లి నేను ఈ చట్టాన్ని, ఈ ఆదేశాన్ని తయారుచేశాను దీని ప్రకారం నడుచుకో అని చెప్పడు. సమాజం లోకి వెళ్ళడు. కానీ ఒక సర్క్యులర్ జారీ చేస్తాడు అది ప్రజలకు చేరవేయ బడుతుంది.
అలాగే అల్లాహ్ కూడా ప్రజలకు కావలసిన చట్టాలను, ఆదేశాలను గ్రంథాల రూపంలో ప్రవక్తల ద్వారా పంపించాడు.
ఆ గ్రంథాలను, ప్రవక్తలను అనుసరిస్తూ మనిషి జీవించాలి. అప్పుడే అతను పరలోకంలో విజయం సాధించి స్వర్గంలోకి ప్రవేశించగలుతాడు.
తేదీ:28-07-2021
159 వ పాఠం
మిగతా మరొక రోజు
Comments
Post a Comment